ప్రస్తుతం కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. ప్రభుత్వ తెలిపిన లెక్కల ప్రకారం కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ మరణాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది నటి నటులు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే బేధం లేకుండా వారికి తోసిన విధంగా కొంత మంది కైన సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి గారు అమితాబ్ బచ్చన్ గారు సోనూసూద్ గారు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, సందీప్ కిషన్, అడివి శేష్ వంటి సెలబ్రెటీలు ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. అలాగే నటి రేణు దేశాయ్ గారు కూడా ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ కష్ట సమయంలో మందులు, ఆహారం నిత్య అవసర సరుకులు ఎలాంటి అవసరం ఉన్నా తనకు మెసేజ్ చేయాలని ఆమె తెలిపిపారు. అయితే కొంత మంది డబ్బులు కావాలని మెసేజ్ లు చేస్తున్నారు అంటా. ఈ రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా ఈ విషయాన్నీ తెలియజేశారు. ప్రస్తుతం కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులపై ఎవరికైనా ఆహారం, మందులు సాయం చేయగలం కానీ డబ్బులు మాత్రం అడగకండి అంటూ పోస్ట్ పెట్టారు. ఇటు వంటి కష్ట సమయంలో ఎంతో మంది పేద వారికి సహయం చేస్తున్న రేణు దేశాయ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
డబ్బులు మాత్రం అడగకండి – రేణు దేశాయ్
