Site icon syeraa

తేజ ఆర్ పి పట్నాయక్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 1.1

బాలీవుడ్ లో కెమెరా మెన్ గా సక్సెస్ వచ్చిన తర్వాత టాలీవుడ్ లో దర్శకుడి మారిన తేజ గారు తీసిన మొదటి సినిమా ‘చిత్రం’. ఉదయ్ కిరణ్ హీరోగా రీమ సేన్ కధానాయిక వచ్చిన ఈ సినిమా పెద్ద విజయం సాధించడం ఆర్ పి పట్నాయక్ సంగీతం ఈ సినిమాకి పెద్ద హైలైట్ నిలిచింది. రామోజీ రావు ప్రొడ్యుసర్ గా వచ్చిన ఈ సినిమా కొత్త నటీనటులతో, తక్కువ బడ్జెట్ లో తయారై సూపర్ హిట్ కొట్టింది. తేజకు ప్రతిభావంతుడైన దర్శకుడుగా గుర్తింపును తెచ్చింది.

ఇప్పుడూ తిరిగి 21 సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఇప్పుడు చిత్రం 1.1 తీస్తున్నారు దర్శకుడు తేజ ఈ చిత్రానికి ఆర్ పి పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. చాలాకాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం 1.1 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది . మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇవాళ తేజ గారి బర్త్ డే సందర్బంగా ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ను తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మా తరుపున ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న తేజ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

Exit mobile version