Site icon syeraa

డియర్ మేఘ చిత్రం పై అంచనాలు పెంచింది మేఘా ఆకాష్

యువ నటి మేఘా ఆకాష్ మంచి పాత్రలను ఎన్నుకుంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఆమె ‘డియర్ మేఘ’ అనే ఎమోషనల్ డ్రామా చిత్రంలో చేస్తుంది. ఈ రోజు ఫస్ట్ లుక్ ను అలాగే మోషన్ పోస్టర్‌ను రానా దగ్గుబాటి, విజయ్ సేతుపతి అలాగే దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రారంభించారు. మేఘ కళ్ళ నుండి కన్నీళ్ళు చుక్కలు కారుతూ ఆమె గుండెలు బాదుకుంది. ఆమె హృదయాన్ని ఎవరు బాదించారు అనే విషయం సినిమాలోనే చూడాలి. ఈ చిత్రంలో అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు కూడా నటించగా, సుశాంత్ రెడ్డి ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ చూస్తు వుంటే ఈ చిత్రం పై మరింత ఆసక్తి పెంచాయి.

Exit mobile version