Site icon syeraa

దర్బార్ కోసం డబ్బింగ్ పూర్తి చేసిన రజనీ

గత గురువారం తన తదుపరి దర్బార్ కోసం డబ్బింగ్ ప్రారంభించిన రజిని, ఈ రోజు పూర్తి చేశాడు. రజనీతో చేస్తున్న ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమని మురుగదాస్ చెప్పడం, అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన తన పోర్షన్ ను రజనీ పూర్తి చేశారు.

ఆ తరువాత హిమాలయాలకు వెళ్లి వచ్చిన ఆయన, ఇటీవలే డబ్బింగ్ చెప్పడం మొదలెట్టారు. రజనీ తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకోవడం పూర్తయిందని, తాజాగా తన ట్విట్టర్ ద్వారా మురుగదాస్ తెలియజేశాడు. రజనీతో కబుర్లు చెబుతున్న ఫొటోను షేర్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా మిగతా పనులను పూర్తిచేసుకోనుంది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను, సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 10వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు.

Exit mobile version