Site icon syeraa

ఆచార్య చిత్రంలో మెగా స్టార్ డబుల్ రోల్?

మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రం ఆచార్య సినిమా చేస్తున్నారని, దీనికి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం 40% ఇప్పటికే షూట్ పూర్తి అయ్యింది. కరోనా వ్యాప్తి అధికంగా ఉండటం తో లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కొద్దిగా ఆలస్యం అయ్యింది అనే చెప్పాలి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక గాసిప్ వైరల్ అవుతుంది ఈ చిత్రంలో చిరు డబుల్ రోల్ లో కనిపించనున్న తాజా గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఈ డబుల్ రోల్ వస్తుందనే వార్త కూడా ఉంది.

ప్రస్తతానికైతే ఈ వార్త కి సంబంధించిన ఎటు వంటి సమాచారం అయితే లేదు, కానీ ఈ వార్త అభిమానుల అందరినీ ఆకర్షించింది. ఇందులో కాజల్ కథానాయకురాలిగా నటిస్తుండగా అలాగే రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Exit mobile version