Site icon syeraa

చిరు మొబైల్ ద్వారా షూట్ చేసిన వీడియో అదుర్స్

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత చిరు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి నటించిన ఇంద్ర, సైరా వంటి సినిమాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు. తన టాలెంట్‌తో మంచి పేరు కూడా సంపాదించుకున్నారు. ఈ రోజు చిరంజీవి గారు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ద్వారా సుస్మిత కొణిదెల కూతురు సంహిత రుద్రమదేవి సినిమాలో డైలాగ్ చెప్పి తాతయ్య చిరు మనస్సు గెలుచుకుంది. చిరంజీవి గారు మొబైల్ ద్వారా ఈ వీడియోను షూట్ చేసారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సంహిత రుద్రమదేవి పాత్రను చాలా బాగా చేసిందంటూ కామెంట్స్ ద్వార అభినందనలు తెలుపుతున్నారు చిరు అభిమానులు.

చిన్నారుల అభిరుచిని తల్లి తండ్రులు ప్రోత్సహిస్తే, అది వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది అంటూ చిరంజీవి గారు ఈ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంతో బిజీగా ఉన్నారు చిరంజీవి గారు.

Exit mobile version