Site icon syeraa

అఖిల్, అకిరాకు పుట్టిన రోజు శభాకాంక్షలు తెలిపిన చిరు

ఈ రోజు అనగా ఏప్రిల్ 8 కొందరు సినీ ప్రముఖుల పుట్టిన రోజు ఈ రోజు. అలాగే హనుమాన్ జయంతి కూడా ఈ రోజు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభకాంక్షలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విధంగా తెలియజేశారు.

అక్కినేని,కొనిదేలా కుటుంబాలకు చెందిన ఇద్దరు పిల్లలు అఖిల్ అక్కినేని అలాగే అకిరా నందన్ ఈ రోజు తమ పుట్టినరోజులను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా, వారి మనసుకు హత్తుకునే విధంగా ట్వీట్‌లతో శుభాకాంక్షలు తెలిపారు.

అఖిల్ గురించి చిరు మాట్లాడుతూ, అఖిల్ తనకు సురేఖాకు చిన్న కొడుకులంటి వాడు అని అలాగే రామ్ చరణ్ కు చిన్న తమ్ముడు లాంటి వాడు అని మెసేజ్ పెట్టారు.అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని అలాగే తనకు ఇష్టమైన అబ్బాయి అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు . ఈ సంవత్సరం తనకు ఎంతో బాగుండాలని చిరు అఖిల్‌ను కోరుకున్నారు. అదే విధంగా చిరుతో దిగిన అఖిల్,నాగార్జున చిత్రాన్ని పోస్ట్ చేశారు.

అదే విధంగా పవన్ కళ్యాణ్ పెద్ద అబ్బాయ్ అకిరాను చిరు ఎత్తుకుని ఉన్న ఫోటోతో ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.మన పిల్లలు జీవితంలో గొప్ప ఎత్తులకు చేరుకోవాలని మనమందరం కోరుకుంటున్నాము.నాచేతుల్లో ఉన్న చిన్న పిల్లవాడు గొప్ప ఎత్తుకు చేరుకోవలని అదే విధంగా తను హైట్ లో అందరినీ అధిగమించాడు (6’4) (హైట్ గురించి) అదే విధంగా భవిష్యత్తులో కూడా ఎన్నో ఎత్తులు వెదగాలని చిరు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చిరు ఈ విధంగా అకిరా కు పుట్టిన రోజు శభాకాంక్షలు తెలియజేశారు.

Exit mobile version