Site icon syeraa

సల్మాన్ ఖాన్ పన్వెల్ ఫామ్‌హౌస్‌లో ప్రోమో షూట్

బిగ్ బాస్ షో అంటేనే ప్రత్యేకం ఎందుకంటే ఈ షో కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు. ముందు తెలుగులో వచ్చిన మూడు సీజన్లు హిట్ అయిన సంగతి తెలిసిందే ఇప్పుడు హిందీ మరియు తెలుగు రెండింటిలోనూ బిగ్ బాస్ సీజన్లు గత నెలలో ప్రసారం చేయవలసి ఉండగా, లాక్డౌన్ కారణంగా జరగలేదు.

అయితే హిందీ అలాగే తెలుగు వెర్షన్లు ఆగస్టులో ప్రారంభమవుతాయని చర్చ జరుగుతోంది. తెలుగులో ఇంకా హోస్ట్ ఇంకా ఫిక్స్ కాలేదు, అయితే సల్మాన్ ఖాన్ ఈ ఏడాది కూడా హిందీ సీజన్ ఆతిథ్యం కొనసాగించనున్నారు.

ఈ షో మొట్టమొదటి ప్రోమో షూట్ కోసం, సల్మాన్ ముంబైలోని తన పన్వెల్ ఫామ్‌హౌస్‌లో షూట్ జరిగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాడు అని సమాచారం. పరిమిత సిబ్బంది ప్రోమో షూట్ జరుగుతుందని సమాచారం.తొందర్లోనే ప్రోమో విడుదల చేస్తారు అని సమాచారం.

Exit mobile version