నటుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బి గోపాల్ కలిసి ఇప్పటివరకు ఐదు సినిమాలు తీశారు.అవి లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమర సింహ రెడ్డి, నరసింహ నాయుడు, తరవాత వచ్చిన పల్నాటి బ్రహ్మ నాయుడు వారి చివరి సినిమా, కాని ఆ మూవీ వారి అంచనాలను అందుకోలేకపోయింది.
అయితే, ఇప్పుడు బాలకృష్ణ మరియు గోపాల్ తమ మాయాజాలాన్ని తిరిగి రిపీట్ చేయలన్ని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. నివేదికల ప్రకారం, ఇద్దరూ ఒక మంచి చిత్రం తీయాలని నిర్ణయించుకున్నారు. ఇది బి గోపాల్, బాలయ్య కాంబినేషన్లో వస్తున్న ఆరోవ చిత్రం కావడం చాలా గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమా మీద బారి అంచనాలే నెలకొన్నాయి. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం మరియు సిబ్బందిని ఇంకా నిర్ణయించలేదు. అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుందని సమాచారం.
ఇంతలో, బాలకృష్ణ 2019 డిసెంబర్‌లో ప్రారంభించిన బోయపాటి శ్రీనివాస్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం సింహా మరియు లెజెండ్ తర్వాత వారి మూడవ హ్యాట్రిక్ మూవీ, ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. మిరియాలా రవీందర్ రెడ్డి నిర్మాత గా చేయబోయే ఈ చిత్రానికి ఎస్ తమన్ సంగీతం సమకూర్చుతున్నారు. తాత్కాలికంగా ఎన్‌బికె 106 అని పేరు పెట్టబడిన ఈ చిత్రం మీద బారి అంచనాలే ఉన్నాయి.
