కొత్తగా సినిమాలు తీయాలని ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మన తెలుగు దర్శకుడు క్రిష్ త్వరలో క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాతో రాబోతున్నా విషయం తెలిసిందే. అయితే క్రిష్ గారి ఆఫీస్ లో ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. క్రిష్ గారు కూర్చునే ఆఫీస్ చైర్ మీద ఒక పావురం వచ్చి వాలింది. అది చూసిన ఆయన కొద్దిగా అవ్వక్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఫోటో షేర్ చేసి ట్వీట్ చేశారు. ఒకసారి మీరు కూడా చూసేయండి.
హరిహర వీరమల్లు ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడుతుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి వెళ్లనుంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు అవ్వనుంది. ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.