Site icon syeraa

మెగాస్టార్ తో కలిసి స్క్రీన్ మీద కనిపించడం అమ్మ కల

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి ఒకే స్క్రీన్ మీద చూడాలి అని ప్రతి మెగా అభిమానికి ఉంటుంది. ఇప్పుడు అదే కోరిక మరో సారి తీర్చడానికి వస్తున్న దర్శకుడు కొరటాలశివ ఆచార్య చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి 152 వ చిత్రం చేస్తున్నారు. రామ్ చరణ్ కొనిదేలా ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌లో కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

అయితే తాజా ఇంటర్వ్యూలో, రామ్ చరణ్ మొదటిసారి ఆచార్యలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ధృవీకరించారు. తన తండ్రితో కలిసి స్క్రీన్ పంచుకోవడం గురించి మాట్లాడరు చరణ్, తనకు వచ్చిన స్టార్‌డమ్ ప్రజాదరణకు తన తండ్రికి రుణపడి ఉన్నానని చెప్పారు అతనితో కలిసి నటించడం చాలా ఆనందం కలిగిస్తుందని ఇటువంటి అవకాశం రావడం చాలా హ్యపీగా ఉంటుందని చెప్పారు.

మగధీర, బ్రూస్ లీ చిత్రాల్లో నాన్న ఒక చిన్న అతిధి పాత్ర పోషించాడు. అలాగే నేను అతని పున ప్రవేశ చిత్రం ఖైదీ నం150 లో కూడా నాన్నతో కలిసి డాన్స్ చేసే అవకాశం రావడం. అలాగే ఇప్పుడు మరోసారి నాన్న నేను ఒకే స్క్రీన్ మీద చూడటం అమ్మ కల అని చెప్పారు. ఆచార్యతో ఆమె కల నెరవేరినందుకు నేను సంతోషిస్తున్నాను,అని చరణ్ అన్నారు.

ఆచార్యలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, అలాగే సోనూసూద్‌, అజయ్‌, హిమజ తదితరులు పలు పాత్రల్లో నటించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version