స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు నచ్చితే కొద్దిగా లేట్ అయినకాని తప్పకుండా అభినందిస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే అల్లు అర్జున్ మనస్తత్వం అటువంటిది మరి. తక్కువ బడ్జెట్ తో వచ్చిన మంచి కథ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందిన పీరియడ్ డ్రామా పలాసా 1978 ను చూసిన అల్లు అర్జున్ ఈ రోజు పలాసా దర్శకుడు కరుణ కుమార్‌ను పిలిచి ఒక మొక్కను బహుమతిగా ఇచ్చి అభినందించారు. ఇలాంటి మంచి దర్శకులు తెలుగు చిత్రాలలో రావడం చాలా ఆనందంగా ఉందని బన్నీ అన్నారు. పలాసా 1978 యొక్క మొత్తం బృందానికి అభినందనలు తెలియజేశారు. గొప్ప అంతర్లీన సందేశంతో అద్భుతమైన చిత్రాన్ని తీశారు అని నేను వ్యక్తిగతంగా ఇష్టపడ్డాను అని అల్లు అర్జున్ ట్వీట్ చేసారు. ఈ అభినందనకు దర్శకుడు కరుణ కుమార్ ధన్యవాదాలు తెలిపారు ఇది అద్భుతమైన జ్ఞాపకం ఉంటుందని మంచి సినిమా పట్ల మీకు ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని ఇది లైఫ్ టైమ్ మెమరీ అంటూ రిప్లై ఇచ్చారు దర్శకుడు కరుణ కుమార్.
అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ యొక్క ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం కరుణ కుమార్ ఇటీవల మెట్రో కథలు అనే చిత్రాన్ని రూపొందించారు.
Thank you Sir. It was a wonderful memory . Your kind gesture, heart felt appriciation towards good cinema made me emotional. Thank you @alluarjun sir. It’s a life time memory. https://t.co/SgZ3THRnfF
— KarunaKumar (@Karunafilmmaker) October 2, 2020