Site icon syeraa

అలియా భట్ ఆర్ఆర్ఆర్ మూవీ లో వుంటుందా?

నటి అలియా భట్ బాలీవుడ్ లో వరుస ఆఫర్లు రావడంతో బిజీ అయ్యింది. అయితే కరోనావైరస్ భయం కారణంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ అకస్మాత్తుగా ఆగిపోవడంతో, బాలీవుడ్ సర్కిల్‌లలో కొత్త పుకార్లు మొదలయ్యాయి. తాజా సంచలనం ఏమిటంటే, స్టార్ బాలీవుడ్ నటి అలియా భట్ ఏప్రిల్ నుండి ఆర్ఆర్ఆర్ కోసం తన తేదీలను సర్దుబాటు చేయలేనందున, ఆర్ఆర్ఆర్ నుండి తప్పుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పుడే అలియా సంజయ్ లీలా భన్సాలీ గంగూభాయ్ చిత్రీకరణలో ఉన్నారు. గంగూభాయ్ షూటింగ్ ఏప్రిల్‌కు వాయిదా వేయడంతో పాటు, ఆర్‌ఆర్‌ఆర్ కోసం ఆమె మొదటి షెడ్యూల్ కూడా ఏప్రిల్‌లో జరగనుంది, అలియా
గంగూభాయ్ కంటే ఆర్ఆర్ఆర్ మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఆమె ఆర్‌ఆర్‌ఆర్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకునట్లు వస్తున్న వార్తలో వాస్తవం లేదని తెలుస్తుంది.

అయినప్పటికీ, కొందరు మీడియా వాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఆర్ఆర్ఆర్ మేకర్స్ కొందరు వెంటనే ఖండించారు. ఆర్ఆర్ఆర్ షూట్ కోసం ఆమె తేదీలను సర్దుబాటు చేస్తామని ఆమె వారికి హామీ ఇచ్చినట్లు సమాచరం. రామ్ చరణ్, ఎన్ టి ఆర్ కథా నాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో జనవరి 8న విడుదల కాబోతుంది.

Exit mobile version