బాలీవుడ్ లో తన అందమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపందించుకున్న అందమైన నటి ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యకంగా చెప్పనవరంలేదు. తన అద్భుమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వ్యరాయ్ ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు అలాగే సినీ ప్రముఖులు. బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల లో కూడా ఎన్నో చిత్రాలు నటించిన ఐశ్వర్యా రాయ్ గొప్ప నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు. చివరిగా 2018 బాలీవుడ్ లో ఫన్నే ఖాన్ అనే చిత్రంలో నటించి తన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. తమిళ్ తెలుగులో 2010 లో వచ్చిన రోబో చిత్రం లో రజినీకాంత్ గారితో చివరిగా నటించారు. అయితే ప్రస్తుతం 2021 గాను పొన్నియిన్ సెల్వన్ అనే చిత్రంలో నటిస్తున్నారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.1 నవంబర్ 1973లో మంగుళూరు కర్ణాటక లో పుట్టిన ఐశ్వర్య అత్యంత అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఈరోజు ఐశ్వర్య రాయ్ పుట్టిన రోజు సందర్బంగా తన అభిమానులు అందరూ తనకు పుట్టిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఐశ్వర్య రాయ్ తన కుటుంబ సభ్యులతో తన 47వ పుట్టిన రోజు జరుపుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈ పుట్టిన రోజు తో ఐశ్వర్య రాయ్ 47 వ సంవత్సములో అడుగు పెట్టబోతున్నారు.
అందాల నటి ఐశ్వర్య రాయ్ పుట్టిన రోజు ఈ రోజు
