Site icon syeraa

మహా రాజ రవితేజ ‘ఖిలాడి’ చిత్రంలో నటి అనసూయ

టాలీవుడ్ మాస్ మహా రాజ రవితేజ ‘క్రాక్’ మూవీ సక్సెస్ తరువాత నటిస్తోన్న మరో చిత్రం ‘ఖిలాడి’ రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రముఖ‌ యాంకర్ నటి‌ అనసూయ భరద్వాజ్‌ నటించబోతున్నారు. ‌ఈ వార్తను ఈ చిత్ర బృందం సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తనకి స్వాగతం పలుకుతూ ట్వీట్ చేసారు. ప్రస్తుతం అనసూయ
థాంక్యూ బ్రదర్‌ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే అనసూయ తాజాగా రవితేజ ఖిలాడీ మూవీకి ఓకే చెప్పడంతో మరింత ఆసక్తి పెరిగింది ఈ చిత్రం పై. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటి అనసూయ కనిపించనుంది.
పెన్ స్టూడియోస్, హ‌వీష్ ప్రొడ‌క్షన్స్ సంయుక్తంగా ఖిలాడి సినిమాను నిర్మిస్తున్నారు. మే నెలలో వేసవి కానుకగా సినిమాను తీసుకొచ్చేందుకు మూవీ యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version