లాక్ డౌన్ కారణంగా ఆగిన ఆచార్య షూటింగ్ తిరిగి మళ్లీ ఈ రోజు ప్రారంభం అయింది. మెగాస్టార్ చిరంజీవి గారు తిరిగి ఆచార్య చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆచార్య చిత్రీకరణను ఈ రోజు హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభించారు. పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న భాగాలన్నీ రెండు షెడ్యూల్లో పూర్తవుతాయి అని సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్ షూట్ పూర్తయిన తర్వాత ఆచార్య సెట్స్‌లో రామ్ చరణ్ చేరనున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి గారు పెండింగ్‌లో ఉన్న భాగాలను పూర్తి చేయనున్నారు. దర్శకుడు కోరటాల శివ కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే అన్నీ సరిగ్గా జరిగితే అక్టోబర్ లో ఈ చిత్రం విడుదల కానుంది. నటి కాజల్ అగర్వాల్ కూడా షూట్లో పాల్గొంటారు. రామ్ చరణ్ పక్కన పూజా హెగ్డే జత కడుతున్న విషయం తెలిసిందే. ఆచార్య చిత్రం భారీ అంచనాలను పెంచుతుంది అభిమానుల్లో, ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నరు.ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు.