Site icon syeraa

పెళ్లిసందడి చిత్రం వచ్చి ఈ రోజుతో 25 సంవత్సరాలు

ప్రముఖ దర్శకుడు కె రాఘవేద్రరావు గారు తెరకెక్కించిన అద్భుత చిత్రం పెళ్లిసందడి ఈ సినిమా వచ్చి ఈ రోజుతో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రాఘవేంద్ర రావు గారు సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా పంచు కున్నారు. రాఘవేంద్రరావు గారు ఈ విధంగా పోస్ట్ పెట్టారు – పెళ్లిసందడి నేటికి సినిమా విడదల అయ్యి 25 ఏళ్ళు అయింది. నా కెరీర్ లో, శ్రీకాంత్ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా చేసిన ప్రేక్షకాభిమానులకు, కీరవాణి కి, చిత్ర నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, జగదీష్ ప్రసాద్ లకు నమస్కరిస్తున్నాను అంటూ తెలిపారు.

ప్రస్తుతం పెళ్లి సందడి 2 లో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నరు. రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో ఈ సినిమా తెరెక్కుతోంది. ఈ చిత్రంలో మలయాళ నటి మాలవికా నాయర్ ప్రముఖ కథానాయిక పాత్ర కోసం ఎంపికయ్యారు. గౌరీ రోనాంకి దర్శకత్వం వహించనున్నారు ఈ చిత్రానికి. కెఆర్ఆర్ యొక్క ఆర్ కె ఫిల్మ్స్ మరియు ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సహ-నిర్మిస్తాయి. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version